రణబీరే ఆదిత్య రాయ్‌కి సలహా ఇచ్చాడు: మోహిత్ సూరి

రణబీరే ఆదిత్య రాయ్‌కి సలహా ఇచ్చాడు: మోహిత్ సూరి

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆషికి 2 ఎంత పెద్ద హిట్టయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆదిత్య‌రాయ్ కపూర్. శ్ర‌ద్ధ క‌పూర్ జంట‌గా నటించిన ఈ సినిమా ల‌వ్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చి సూప‌ర్ హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్‌లను స్టార్‌లుగా నిలబెట్టింది. ఈ సినిమాలోని పాట‌లు ఇప్ప‌టికీ ప్ర‌తీచోట వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాలో హీరోగా ఆదిత్య‌రాయ్ క‌పూర్‌ని ఎంపిక చేయ‌డంపై ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించాడు ద‌ర్శ‌కుడు మోహిత్ సూరి. ఈ సినిమాకు ఆదిత్య రాయ్‌ని ఎంపిక చేసే ప్రక్రియలో రణబీర్ కపూర్ కీలక పాత్ర పోషించారని మోహిత్ సూరి స్వయంగా వెల్లడించారు. త‌న తాజా సినిమా సైయారా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న మోహిత్ సూరి ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆషికి 2’ గురించి ప్ర‌స్తావించాడు. ‘ఆషికి 2’ కోసం నూతన నటీనటులను ఎంపిక చేయడానికి దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్ నిర్వహించామని.. అయితే తాము అనుకున్న విధంగా ఫలితం దక్కలేదని మోహిత్ పేర్కొన్నారు. ఆ సమయంలోనే, రణబీర్ కపూర్ ఆదిత్య రాయ్ కపూర్‌కు ఫోన్ చేసి, “నువ్వు వెళ్లి మోహిత్ సూరిని మీటవ్వు, అతను మంచి దర్శకుడు” అని చెప్పినట్లు మోహిత్ సూరి వెల్లడించారు. రణబీర్ మాటతోనే ఆదిత్య రాయ్ కపూర్ తనను కలవడానికి వచ్చాడని, అప్పుడు షార్ట్, టీష‌ర్ట్‌తో వ‌చ్చిన‌ అతని డ్రెస్సింగ్ స్టైల్‌ కాస్త వెరైటీగా అనిపించింద‌ని. కానీ.. ఆదిత్యలో రాహుల్ జైకర్ (ఆషికి 2లోని హీరో) పాత్రకు సరిపోయే లక్షణాలు ఉన్నాయని అందుకే అత‌డిని తీసుకున్నామ‌ని మోహిత్ చెప్పుకొచ్చాడు. అలా రణబీర్ కపూర్ ఇచ్చిన చిన్న సలహానే ఆదిత్య రాయ్ కపూర్ కెరీర్‌లో పెద్ద మలుపుగా మారి ‘ఆషికి 2’ లాంటి బ్లాక్‌బస్టర్ వచ్చిందన్నారు.

editor

Related Articles