టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో హీరో రామ్ చరణ్ – ఉపాసన జంట ఒకటి. వారికి ప్రత్యేక స్థానం ఉంది. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఇద్దరూ తమ కెరీర్‌ల్లో బిజీగా ఉన్నా, వ్యక్తిగత జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా కొనసాగిస్తున్నారు. 2023 జూన్ 20న వారిద్దరికీ కుమార్తె పుట్టిన విషయం తెలిసిందే. పాపకు క్లింకార అని పేరు పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన కొణిదెల తమ వైవాహిక జీవితంపై ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ జీవితంపై రామ్‌చరణ్ ఎప్పుడూ మద్దతుగా ఉంటారని ఉపాసన వెల్లడించారు. కాగా, ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో CSR వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాల్లోనూ ఆమె ముందుండి పనిచేస్తున్నారు. పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. అయితే రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఇప్పటికీ తమ కూతురు ఫేస్ ప్రజలకు చూపెట్టడం అంటే భయమేస్తోందని అన్నారు. ప్రతిసారి కూడా తమ కూతురి ఫేస్ కనిపించకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి కారణం ఉపాసన తాజాగా తెలియజేసింది. ప్రపంచం ఇప్పుడు చాలా స్పీడ్‌గా ముందుకి పోతోంది. ఎప్పుడు ఎలాంటి సంఘటన జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కొన్ని సంఘటనలు మమ్మల్ని భయపెట్టడంతో మా పాపని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాము. ఇప్పటికీ మేము బయటకి వచ్చినప్పుడు మా పాపకి మాస్క్ వేస్తాము. ఈ విషయంలో రామ్‌చరణ్, నేను సంతోషంగానే ఉన్నాము.

- October 7, 2025
0
51
Less than a minute
You can share this post!
editor