‘నువ్వుంటే చాలే’ అంటున్న రామ్..!

‘నువ్వుంటే చాలే’ అంటున్న రామ్..!

హీరో రామ్ పోతినేని లేటెస్ట్ సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్‌ను మేకర్స్ వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాని దర్శకుడు పి.మహేష్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ అదిరిపోయే లుక్స్‌తో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను పూర్తి రొమాంటిక్ సాంగ్‌గా మ్యూజిక్ ద్వయం వివేక్-మెర్విన్ కంపోజ్ చేశారు. ఇక ఈ పాటకు సాహిత్యం రామ్ స్వయంగా అందించడంతో ఈ పాటపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ‘నువ్వుంటే చాలే’ అంటూ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ పాటను పాడిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రోమోయే సాంగ్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. దీంతో ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

editor

Related Articles