రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా ఒకరోజు ముందే విడుదల కాబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం.
ప్రస్తుతం ఏ సినిమా కూడా ముందు అనుకున్న విధంగా విడుదలకు నోచుకోవడం లేదు. చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలదీ ఇదే పరిస్థితి. డిసెంబర్‌లో రావాల్సిన అడివి శేష్ ‘డెకాయిట్’ సినిమా ఏకంగా మూడు నెలలకు వాయిదా పడింది. అయితే చిత్రంగా కొన్ని సినిమాలు ఒకటి రెండు రోజుల ముందో, వారం ముందో వచ్చేస్తున్నాయి కూడా. అలా ఆ మధ్య ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ఓ వారం ముందే వచ్చేసింది. మంచి విజయాన్ని అందుకుంది. అలానే ఇప్పుడు రామ్ పోతినేని నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కూడా కాస్తంత ముందుగానే రిలీజ్‌కి వస్తోంది. ఈ సినిమా మామూలుగా అయితే నవంబర్ 28న విడుదల కావాల్సి ఉంది. సహజంగా విడుదల తేదీకి ఒక రోజు ముందు యు.ఎస్.ఎ.లో ప్రీమియర్స్ వేస్తుంటారు. కానీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాకి అమెరికాలో ప్రీమియర్స్ నవంబర్ 26నే వేస్తున్నారు.


