Movie Muzz

మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న చరణ్-ఉపాసన

మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న చరణ్-ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మరోసారి సంబరాలు మొదలయ్యాయి. హీరో రామ్ చరణ్, ఉపాసన జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యామిలీ వారిని ఆశీర్వదించేందుకు తరలివచ్చారు. ఈ విషయాన్ని ఉపాసన తాజాగా ప్రకటించారు. ఈ దీపావళి పర్వదినాన తమ ఇంట్లో ఆనందం రెట్టింపు అయ్యింది.. ప్రేమానురాగాలు రెట్టింపు అయ్యాయి.. ఆశీర్వచనాలు కూడా రెట్టింపుగా వచ్చాయని ఆమె ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ సభ్యులు ఉపాసనకు స్వీట్స్ తినిపిస్తూ ఆమెను ఆశీర్వదించే సీన్స్ మనకు కనిపించాయి. అటు మరోసారి తండ్రి కాబోతున్న చరణ్ కూడా మిక్కిలి సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ చరణ్ – ఉపాసన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

editor

Related Articles