టాలీవుడ్‌లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న రామ్ చ‌ర‌ణ్..

టాలీవుడ్‌లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న రామ్ చ‌ర‌ణ్..

టాలీవుడ్ హీరో రామ్‌చ‌ర‌ణ్ సినీ పరిశ్రమలో నేటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్, సినీవర్గాలు ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘చిరుత’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, తన 18 ఏళ్ల కెరీర్‌లో ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్లతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్ర‌స్తుతం బుచ్చిబాబు సానాతో పెద్ది సినిమా చేస్తున్నాడు. అయితే రామ్ చ‌ర‌ణ్ 18 ఏళ్లు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. పెద్ది నుండి కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్టర్‌లో రామ్ చ‌ర‌ణ్ రస్టిక్ లుక్‌లో గడ్డం, మాసిన జుట్టుతో చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు.

editor

Related Articles