నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘రాకాస’ చిత్రం టీజర్ విడుదలైంది. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను మానస శర్మ తెరకెక్కించారు. నయన్ సారిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ లాంచ్ ఈవెంట్లో నిహారిక మాట్లాడుతూ పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించాలనే లక్ష్యంతో తీస్తున్నామని తెలిపారు. ఈ చిత్రంతో సంగీత్ శోభన్ మరింత గుర్తింపు పొందుతాడని అన్నారు. సంగీత్ శోభన్ మాట్లాడుతూ కథ చెప్పిన వెంటనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానని, ఇది పూర్తిగా ఎంటర్టైనింగ్ మూవీ అవుతుందని చెప్పారు. దర్శకురాలు మానస శర్మ ఈ సినిమాకోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డామని, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా తీర్చిదిద్దామని తెలిపారు. అనుదీప్ సంగీతం, గెటప్ శ్రీను, రోహిణి కీలక పాత్రలు ఈ చిత్రానికి హైలైట్ కానున్నాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ‘రాకాస’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.


