అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. “రాజు వెడ్స్ రాంబాయి” విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈటీవీ విన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ తన్మయ్ మాట్లాడుతూ ‘రాజు వెడ్స్ రాంబాయి’ వెనక మా రెండేళ్ల కష్టం ఉంది.ఈ రోజు ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ప్రేక్షకులు ఇచ్చారు అన్నారు. చిత్ర సమర్పకులు డా.నాగేశ్వరరావు పూజారి మాట్లాడుతూ ఈ తరంలోని ప్రతి ప్రేమ జంట చూడాల్సిన చిత్రమిది.
- November 22, 2025
0
34
Less than a minute
You can share this post!
editor

