Movie Muzz

గ్యాంగ్‌స్టర్‌గా రాజ్‌కుమార్ రావు.. ‘మాలిక్’ టీజర్

గ్యాంగ్‌స్టర్‌గా రాజ్‌కుమార్ రావు.. ‘మాలిక్’ టీజర్

బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మాలిక్ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాకు పుల్కిత్ దర్శకత్వం వ‌హిస్తుండగా.. టిప్స్ ఫిల్మ్స్, నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై కుమార్ తౌరానీ, జే షెవాక్రమణి నిర్మిస్తున్నారు. మానుషి చిల్లర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. ప్రసేన్‌జిత్ ఛటర్జీ, మేధా శంకర్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా జూలై 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. టీజ‌ర్ చూస్తుంటే.. ఈ సినిమా 1988 అలహాబాద్ నేపథ్యంతో కూడిన అండర్‌వరల్డ్ డ్రామాగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. సామాన్య యువ‌కుడి నుండి ఒక వ్య‌క్తి గ్యాంగ్‌స్ట‌ర్‌గా ఎలా మారాడు అనేది ఈ సినిమా స్టోరీ అని స‌మాచారం. రాజ్‌కుమార్ రావు గతంలో చేసిన కామెడీ లేదా సాఫ్ట్ పాత్రలకు భిన్నంగా, పూర్తిగా క్రూరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఇందులో కనిపించ‌బోతున్నాడు.

editor

Related Articles