బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేశాడు ఈ నటుడు. అయితే తాను తండ్రి కావడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు రాజ్‌కుమార్ రావు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌కుమార్ రావు మాట్లాడుతూ.. నేను గొప్ప తండ్రిని అవుతాను. ఎందుకంటే నేను మంచి భర్తను కాబట్టి. నా స్నేహితుల్లో చాలామంది తల్లిదండ్రులుగా మారిన తర్వాత జీవితంలో ఇదే అత్యుత్తమ దశ అని చెబుతున్నారు. మేము కూడా ఆ క్షణం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. మేము తల్లిదండ్రులు అవ్వబోతున్నాం అనేది ఇంకా నమ్మశక్యంగా అనిపించడం లేదని, ప్రతిరోజూ కొత్తగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ దాదాపు 15 ఏళ్లుగా కలిసి ఉన్నారు. 2021 నవంబర్‌లో ఈ జంట పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
- July 11, 2025
0
49
Less than a minute
Tags:
You can share this post!
editor

