ర‌జ‌నీకాంత్ మంచి మ‌న‌సుతో పిల్ల‌ల‌కి గిఫ్ట్స్..

ర‌జ‌నీకాంత్ మంచి మ‌న‌సుతో పిల్ల‌ల‌కి గిఫ్ట్స్..

తాజాగా ‘తలైవా’ రజినీ సర్  గురించి అక్కినేని నాగార్జున ఒక హృద్యమైన విషయాన్ని వెల్లడించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమాలో రజినీకాంత్‌తో పాటు నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ అనుభవాలను గుర్తుచేసుకుంటూ నాగార్జున రజినీ మంచితనాన్ని ప్రశంసించారు. థాయ్‌లాండ్‌లో 17 రోజులు రాత్రి వేళల్లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాం. దాదాపు 350 మందితో కూడిన బృందం ఎంతో శ్రమించింది. చివరి రోజు, రజినీ  అందరినీ పిలిచి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ప్యాకెట్లు ఇచ్చారు. ఇంటికి వెళ్లినప్పుడు పిల్లల కోసం ఏదైనా కొనండి అంటూ ప్రేమగా చెప్పారు. అలాంటి మనసున్నవారు చాలా అరుదుగా ఉంటారు, అని నాగార్జున భావోద్వేగంతో చెప్పారు. ఇంకా ఆయన పేర్కొన్న అంశం ఒకటి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇన్నేళ్ల అనుభవం ఉన్నా, రజినీ ప్రతి సీన్‌కి ముందు డైలాగ్స్‌ను పక్కకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆయనలో ఉన్న అంకితభావం నిజంగా అంద‌రికీ ప్రేరణగా ఉంటుంది,” అని అన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘కూలీ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

editor

Related Articles