సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా సినిమా కూలీ. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ సినిమాను డబ్బింగ్ స్టూడియోలో చూశారు. ఆ తర్వాత నన్ను హగ్ చేసుకున్నారు. ‘నాకు ఇది దళపతిలా అనిపించింది’ అని చెప్పారు. ఆ రోజు రాత్రి నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను అంటూ అనుభవాన్ని పంచుకున్నారు లోకేష్. ఈ వ్యాఖ్యలతో రజనీకాంత్ అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. 1991లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమా, రజనీ కెరీర్‌లో ఎమోషన్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లకు మారుపేరు. అలాంటి సినిమాను గుర్తు చేయడం అంటే, కూలీపై ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థమవుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ, ముందు రజనీ సార్ కోసం ఒక ఫాంటసీ సినిమా కథను రాశా. ఆయన వెంటనే ఓకే చెప్పారు. కానీ సెట్స్‌పైకి వెళ్లాలంటే ఏడాదిన్నర పడుతుంది. అందుకే కూలీ కథతో ముందుకెళ్లాను. రజనీ సార్ లాంటి వారికైతే మనం ఏ కథనైనా రాయొచ్చు. ఆయనకు ఉన్న లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్‌ను ‘కూలీ’లో ప్రెజెంట్ చేసేందుకు కొత్త టెక్నిక్స్, స్టైల్ ట్రై చేశాను. అయినా ఇది పూర్తిగా రజనీకాంత్ సినిమానే అని వివరించారు. ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

- July 15, 2025
0
40
Less than a minute
Tags:
You can share this post!
editor