‘కూలీ’ స‌క్సెస్ కోసం ర‌జ‌నీ ఫ్యాన్స్ దేవుడికి పూజ‌లు..

‘కూలీ’ స‌క్సెస్ కోసం ర‌జ‌నీ ఫ్యాన్స్ దేవుడికి పూజ‌లు..

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న కూలీ సినిమా రేపు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో గురువారం విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉండ‌గా.. ఇప్ప‌టికే ప‌లు కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు వేత‌నంతో కూడిన‌ సెల‌వులు ఇవ్వ‌డంతో పాటు టికెట్లు కూడా బుక్ చేస్తున్నాయి. అయితే తాజాగా త‌మ అభిమాన హీరో సినిమా హిట్టు అవ్వాల‌ని త‌మిళ‌నాడు తిరుచిరాప‌ల్లిలోని పిళ్ళయార్ (గ‌ణేష్) టెంపుల్‌లో ర‌జ‌నీ అభిమానులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌ అయ్యింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించ‌గా.. ఇందులో నాగార్జున, అమీర్‌ఖాన్, ఉపేంద్ర వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.

editor

Related Articles