‘F1’ సినిమా చూసిన రాజ‌మౌళి ఫ్యామిలీ..

‘F1’ సినిమా చూసిన రాజ‌మౌళి ఫ్యామిలీ..

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, రమా రాజ‌మౌళి దంప‌తులు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ‘F1’ సినిమాను వీక్షించారు. ఆదివారం ప్ర‌సాద్స్‌కి వెళ్లిన రాజ‌మౌళి ఉద‌యం ‘F1’ సినిమాను వీక్షించిన‌ట్లు తెలుస్తోంది. సినిమా అయిపోయిన తర్వాత రాజ‌మౌళి బ‌య‌ట‌కు వెళుతున్న వీడియోను ప్ర‌సాద్ యాజ‌మాన్యం తాజాగా షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే ఈ సినిమాను న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు హీరో ప్రభాస్, క‌న్న‌డ  ద‌ర్శ‌కుడు కేజీఎఫ్, స‌లార్ సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ చూడ‌గా.. తాజాగా రాజమౌళి కూడా వీక్షించారు. అమెరికన్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వ‌చ్చిన సినిమా F1. ఫార్ములా 1 రేసింగ్ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాజిటివ్ టాక్‌తో శరవేగంగా ప్రజల్లోకి దూసుకుపోతోంది.

editor

Related Articles