సీఎం ఇంటికి వెళ్లిన రాహుల్… ఏమి మాట్లాడారో తెలుసా?

సీఎం ఇంటికి వెళ్లిన రాహుల్… ఏమి మాట్లాడారో తెలుసా?

హైదరాబాద్‌: ప్రైవేట్ ఆల్బమ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్‌ రాహుల్ సిప్లిగంజ్, ‘నాటు నాటు’ తో అంతర్జాతీయంగా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఆస్కార్‌ స్టేజ్‌పై పర్ఫార్మ్‌ చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాహుల్, వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఆగస్టులో తన ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న ఆయన, నవంబర్‌ 27న ఈ వేడుకను గ్రాండ్‌గా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. వివాహానికి సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో రాహుల్ సిప్లిగంజ్ తన కాబోయే భార్య హరిణ్యతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వారి వివాహానికి వ్యక్తిగతంగా ఆహ్వానించిన రాహుల్‌కు, రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

editor

Related Articles