టాలీవుడ్‌లో 10 ఏళ్లుగా తనదైన స్టైల్‌తో యాక్టింగ్ చేస్తున్న హీరోయిన్ రాశీ ఖన్నాకు ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో ఇప్పటికే శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా రాశీ ఖన్నా ఎంపికైనట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సినిమాలో శ్లోక అనే పాత్రలో కనిపించబోతోంది రాశీ. ఈ సందర్భంగా రాశీ ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేసింది. మరోవైపు ఇప్పటికే రాశీ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టి, పవన్ కళ్యాణ్‌తో కలిసి కీలక సన్నివేశాల్లో పాల్గొంటున్నారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- July 22, 2025
0
116
Less than a minute
Tags:
You can share this post!
editor