‘పుష్ప ది రూల్’ అల్లు అర్జున్ కొత్త పోస్ట‌ర్ విడుదల…

‘పుష్ప ది రూల్’ అల్లు అర్జున్ కొత్త పోస్ట‌ర్ విడుదల…

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. మ‌రో 50 రోజుల్లో ‘పుష్ప ది రూల్‌’ కౌంట్‌డౌన్ షురూ కానున్న‌ట్లు చిత్రబృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను షేర్ చేసింది. అల్లు అర్జున్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’.

పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 06న ప్రేక్ష‌కుల ముందుకు వస్తోంది. ఇక ‘పుష్ప 2’ విడుద‌లకు ఇంకా 50 రోజులు మాత్ర‌మే సమయం ఉంది. ఈ సినిమాను ప్రీ పోన్ చేసి డిసెంబ‌ర్ 05న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి చిత్ర‌బృందం ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా ఫహద్‌ ఫాజిల్, సునీల్‌, అనసూయ, జగదీష్ ప్రతాప్‌, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

administrator

Related Articles