Movie Muzz

జపాన్‌లో’పుష్ప’ మానియా..?

జపాన్‌లో’పుష్ప’ మానియా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule) ఇప్పుడు జపాన్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. విడుదలైనప్పటి నుంచి పుష్ప 2 మూవీ దేశవ్యాప్తంగా భారీ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో జపాన్‌కు సంబంధించిన ప్రత్యేక సన్నివేశాలు ఉండటం మరో హైలైట్. పుష్ప ఎంట్రీ ఫైట్ సీన్ జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగగా, అల్లు అర్జున్ జపనీస్ డైలాగ్స్ చెప్పడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Pushpa 2 Japan Release కోసం ఈ చిత్రాన్ని జపాన్‌లో ‘పుష్ప కున్రిన్’ (Pushpa Kunrin) పేరుతో ఈనెల 16న విడుదల చేస్తున్నారు. ప్రీమియర్స్‌ను ఈనెల 15న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి టోక్యో చేరుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించారు. జపాన్ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఇండియన్ సినిమాలకు మంచి ఆదరణ ఉండటంతో, పుష్ప 2 అక్కడ కూడా ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles