మళ్లీ మాస్ మోడ్‌లో ప్రియాంక!

మళ్లీ మాస్ మోడ్‌లో ప్రియాంక!

ఇప్పుడు అందరి దృష్టి మహేశ్‌-రాజమౌళి సినిమాపైనే ఉంది. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌ లు వస్తూనే ఉన్నాయి. ఇందులో కథానాయికగా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక మందాకిని క్యారెక్టర్ లో కనిపించనుంది. విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో ప్రియాంక చీరకట్టులో గన్‌ పేలుస్తూ యాక్షన్‌ మోడ్‌లో దర్శనమిచ్చింది. అటు అందం.. ఇటు ఫైర్‌ కలగలిసిన ఈ స్టిల్‌ ప్రతీ ఒక్కరినీ అలరిస్తోంది. ”ప్రపంచ వేదికపై ఇండియన్‌ సినిమాను పునర్నిర్వచించిన మహిళ. దేశీ గర్ల్‌ మళ్లీ వచ్చేసింది. మందాకిని భిన్న పార్శ్వాలను చూడటానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది” అని ఎక్స్‌ వేదికగా రాజమౌళి పోస్ట్‌ పెట్టారు’. ‘ఆమె పైకి కనిపించే దాని కన్నా ఇంకా ఎక్కువ. మందాకినికి హలో చెప్పండి’ అని ప్రియాంక పేర్కొనగా,  ‘ఆమె వచ్చేస్తోంది..

editor

Related Articles