చాలా ఏళ్ల తర్వాత ప్రభుదేవా, వడివేలు క‌లిసి యాక్టింగ్..  

చాలా ఏళ్ల తర్వాత ప్రభుదేవా, వడివేలు క‌లిసి యాక్టింగ్..  

90వ దశకంలో తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రభుదేవా, వడివేలు కాంబినేషన్ మళ్ళీ తెరపైకి రాబోతోంది. ఈ హిట్ జోడి కలిసి ఓ కొత్త సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్. వీరిద్ద‌రూ క‌లిసి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కాదలన్ (1994) సినిమాలో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేశారు. ఆ త‌ర్వాత లవ్ బర్డ్స్ (1995), మిస్టర్ రోమియో (1996), కాదలా కాదలా (1998), మనదై తిరుడివిట్టై (2001) సినిమాల్లో క‌లిసి న‌టించారు. చివ‌రిగా వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన సినిమా ఎంగల్ అన్నా (2004). ఈ సినిమా తర్వాత మ‌ళ్లీ ఈ జోడీ కలిసి యాక్టింగ్ చేయలేదు. అయితే చాలా ఏళ్ల త‌ర్వాత ప్ర‌భుదేవా, వ‌డివేలు క‌లిసి న‌టించ‌బోతున్నారు. ప్రొడ‌క్ష‌న్ 4 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మోష‌న్ పోస్టర్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఇద్ద‌రు కౌబాయ్ దుస్తుల్లో క‌నిపిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్ట్‌కు సామ్ రోడ్రిగ్స్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. కన్నన్ రవి నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

editor

Related Articles