‘స్పిరిట్‌’ సినిమా షూటింగ్‌ కోసం మెక్సికోకి వెళ్లనున్న ప్రభాస్..

‘స్పిరిట్‌’ సినిమా షూటింగ్‌ కోసం మెక్సికోకి వెళ్లనున్న ప్రభాస్..

ప్రభాస్‌ – సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్‌’ సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలౌతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాజా సాబ్‌’ ‘ఫౌజీ’ సినిమాలను పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాతే ‘స్పిరిట్‌’ సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ గురించి సోషల్‌ మీడియాలో ఓ వార్త బాగా ప్రచారమవుతున్నది. నాలుగు నెలల పాటు అక్కడక్కడా చిన్న చిన్న విరామాలతో షూటింగ్‌ జరుగనుందని, ప్రభాస్‌ 90 రోజుల డేట్స్‌ను కేటాయించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. గతంలో చూడని విధంగా ఫిట్‌గా కనిపించాలనే సంకల్పంతో ప్రభాస్‌ ఫిజికల్‌ వర్కౌట్స్  మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. నిజాయితీ, ధిక్కార స్వభావం కలిగిన అగ్రెసివ్‌ పోలీసాఫీసర్‌గా ప్రభాస్‌ పాత్ర అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుందని చెబుతున్నారు. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా సైతం ‘స్పిరిట్‌’ గురించి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం మెక్సికోలోని కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

editor

Related Articles