PCXలో ‘F1’ సినిమాను చూసిన  ప్రభాస్, ప్రశాంత్ నీల్..

PCXలో ‘F1’ సినిమాను చూసిన  ప్రభాస్, ప్రశాంత్ నీల్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క‌న్న‌డ స్టార్ ద‌ర్శ‌కుడు కేజీఎఫ్, స‌లార్ సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ కలిసి హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ (PCX) లో ఉన్న ‘F1’ సినిమాను చూశారు. వీరిద్ద‌రూ ఎఫ్‌1 సినిమాను చూస్తుండ‌గా థియేటర్‌లో ఫ్యాన్స్  మధ్య కనిపించడంతో ఈ ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వీరిద్ద‌రిని చూసిన అభిమానులు ‘సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం ఎప్పుడంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో క‌లిసి డ్రాగ‌న్ అనే సినిమాను షూట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ సినిమా అనంత‌రం స‌లార్ 2 సెట్స్ మీద‌కి వెళ్లే అవ‌కాశం ఉంది. అమెరికన్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వ‌చ్చిన సినిమా F1. ఫార్ములా 1 రేసింగ్ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో డామ్సన్ ఇడ్రిస్, కెరీ కాండన్, జావియర్ బార్డెమ్, టోబియాస్ మెంజీస్, సారా నైల్స్, కిమ్ బోడ్నియా, సామ్సన్ కాయో తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

editor

Related Articles