కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా అందుకున్న భారీ సక్సెస్‌తో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రీక్వెల్‌ను మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, నేడు (జులై 7) రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ‘కాంతార చాప్టర్ 1’ నుండి మేకర్స్ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో కవచంతో యుద్ధం చేస్తున్న రిషబ్ శెట్టి మనకు ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను రిషబ్ శెట్టి మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించేందుకు ఆయన రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా హోంబలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్ 2న గ్రాండ్‌గా అన్ని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.

- July 7, 2025
0
84
Less than a minute
Tags:
You can share this post!
editor