‘రాబిన్‌హుడ్’ కోసం పాప్ క్వీన్..

‘రాబిన్‌హుడ్’ కోసం పాప్ క్వీన్..

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘రాబిన్‌హుడ్’ క్రిస్మస్ కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘వన్ మోర్ టైమ్’ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ పాటను పాప్ క్వీన్, ఇండో-ఫ్యూజన్ సింగర్ విద్యా వోక్స్ పాడింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పాటను నవంబర్ 26న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా జివి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

editor

Related Articles