బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండేకి షాక్ కొట్టినట్టైంది. సెల్ఫీ అని తన దగ్గరికి వచ్చిన ఒక ఫ్యాన్ ఏకంగా ముద్దు పెట్టబోయాడు. బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుందన్న విషయం తెలిసిందే. ఈ బాలీవుడ్ యాక్టర్ తన వివాదాస్పద మాటలతో పాటు పనులతో ఎప్పటికప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇదిలావుంటే తాజాగా ఈ బ్యూటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ముంబై వీధుల్లో పూనమ్ వెళుతుండగా.. ఒక అభిమాని తనతో సెల్ఫీ దిగుదాం అని వచ్చి ఏకంగా ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పూనమ్ పాండే అతడిని గట్టిగా తోసేసి పక్కకు తప్పుకుంది. నటికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామన్య ప్రజల పరిస్థితి ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు.

- February 22, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor