రీ-ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్న పూజా హెగ్డే..?

రీ-ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్న పూజా హెగ్డే..?

హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. అయితే, బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో తెలుగులో సినిమాలను తగ్గించింది. ఇక తాజాగా ఆమె రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో ‘మోనిక’ సాంగ్‌తో మరోసారి అదిరిపోయే క్రేజ్ దక్కించునే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్‌కు సిద్ధమౌతోంది. ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మళ్లీ సాలిడ్ రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దుల్కర్ సల్మాన్ నటించబోయే నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌లో ప్రొడ్యూస్ చేయనున్న సినిమాలో వీరిద్దరు కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కాంబో ప్రేక్షకులకు సరికొత్తగా కనిపిస్తుందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా పూజా హెగ్డే తెలుగులో చాలారోజుల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు మంచి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

editor

Related Articles