మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన పూజా హెగ్డె..

మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన పూజా హెగ్డె..

పూజా హెగ్డె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హీరో వరుణ్ ధావన్‌తో  ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాలో నటిస్తున్నారని పోస్ట్ చేశారు. రెండు సంవత్సరాలుగా ఒక్క హిట్ కూడా లేని ఈ బుట్ట బొమ్మ మూడు సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.

        తమిళంలో సూర్య హీరోగా సూర్య 44, విజయ్ హీరోగా తలపతి 69’  రెండు భారీ ప్రాజెక్ట్స్‌లో ఛాన్స్ కొట్టేసింది పూజ. ఇప్పుడు హిందీలో యంగ్‌ స్టార్‌ హీరో వరుణ్‌ ధావన్‌కి జోడీగా నటించే అవకాశం దక్కింది. త్వరలోనే ఈమె వరుణ్ ధావన్‌తో కలిసి  హై జవానీ తో ఇస్క్ హోనా హైషూటింగ్‌లో పాల్గొననుంది అని సమాచారం.

        పూజా హెగ్డేకి ఇది అతి పెద్ద ఛాన్స్‌గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో హిట్ కొట్టి మరిన్ని సినిమాలు చేయాలని పూజా అభిమానులు కోరుకుంటున్నారు.


editor

Related Articles