తెలుగు సినిమా హీరోయిన్ పూజాహెగ్డే కెరీర్ తొలినాళ్లలోనే అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని తన సత్తా చాటింది. ముఖ్యంగా తెలుగునాట యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ భామకు అదృష్టం ఏమాత్రం కలిసి రావడం లేదు. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్‌గా మిగిలాయి. దీంతో పూజాహెగ్డే కెరీర్ ఇక ముగిసినట్లే అని భావించారు. కానీ ఈ భామ అనూహ్యంగా తిరిగి పుంజుకుంది.
తెలుగు, తమిళం, హిందీలో భారీ అవకాశాలను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. తమిళంలో సూర్య, విజయ్ 69 చిత్రాల్లో ఈ అమ్మడు కథానాయికగా ఖరారైంది. అలాగే బాలీవుడ్‌లో షాహిద్‌కపూర్ సరసన ‘దేవ’ హిందీ సినిమాలో నటించనుంది. ఇలా వరుస భారీ ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తోంది.