సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ మూవీలో వరలక్ష్మి–నవీన్ చంద్ర జంటపై చిత్రీకరించిన మెలోడియస్ లవ్ సాంగ్ “ప్రేమ ఓ ప్రేమ”ను సీనియర్ జర్నలిస్ట్ ప్రభు లాంచ్ చేశారు. అన్విక ఆడియోస్ ద్వారా విడుదలైన ఈ పాటకు సుధాకర్ మారియో సంగీతం అందించారు. యూత్‌ను ఆకట్టుకునే ఈ గీతం ట్రెండింగ్‌గా నిలిచి సూపర్ హిట్ లవ్ సాంగ్స్‌లో స్థానం సంపాదిస్తుందని దర్శకుడు సంజీవ్ మేగోటి ఆశాభావం వ్యక్తం చేశారు. హారర్ థ్రిల్లర్‌తో పాటు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, పృథ్వి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు నటిస్తున్నారు. 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో రూపొందిన ఈ సినిమాకు ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
- March 2, 2026
0
3
Less than a minute
Tags:
- Anvika Audios
- horror action thriller
- latest Tollywood news
- Naveen Chandra
- new Telugu film songs
- Police Complaint movie
- Police Complaint update
- Prema O Prema song
- Ragini Dwivedi
- Ravi Shankar actor
- Sanjeev Megoti director
- Saptagiri
- Srikanth Reddy
- Sudhakar Mario music
- Telugu film news
- Telugu love songs
- Telugu movie songs
- Upcoming Telugu Movies
- Varalaxmi Sarathkumar
You can share this post!
editor


