‘పోకిరి’ రీ-రిలీజ్ ఆగిపోయిందా..?

‘పోకిరి’ రీ-రిలీజ్ ఆగిపోయిందా..?

‘పోకిరి’ రీ-రిలీజ్‌పై అనిశ్చితి నెలకొంది. మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ ఇండస్ట్రీ హిట్ సినిమాను మళ్లీ విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ప్రస్తుతం అది ఆగిపోయినట్టే కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం పూరీ జగన్నాథ్‌పై ఉన్న ఆర్థిక సమస్యలేనని సమాచారం. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాల వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బకాయిలు క్లియర్ చేసే వరకు ఆయన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించకూడదని డిస్ట్రిబ్యూటర్ల యూనియన్ నిర్ణయం తీసుకుంది. దీంతో ‘పోకిరి’ రీ-రిలీజ్‌ను నిలిపివేశారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రీ-రిలీజ్ ఆగిపోవడం పెద్ద షాక్‌గా మారింది. ఇదే సమయంలో ప్రత్యామ్నాయంగా మహేష్ బాబు నటించిన ‘అతిథి’ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారి చర్చనీయాంశమవుతోంది.

Related Articles