హీరోయిన్లు పబ్లిక్ ప్లేస్‌లో కనిపిస్తే చాలు, ఫ్యాన్స్, ఫొటోగ్రాఫర్లూ వారి వెనకపడి ఎలాంటి ఇబ్బందులకి గురి చేస్తుంటారో మనం చూస్తూనే ఉన్నాం. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు, వీడియోలు ఇలా ఓ రేంజ్ హడావిడి మొదలవుతుంది. కొంతమంది సెలబ్రిటీలు వారి ప్రేమను ఓపికతో హాండిల్ చేస్తే, మరికొంతమందికి మాత్రం చిరాకు కలుగుతుంది. తాజాగా గ్లామర్ డాల్ ప్రగ్యా జైస్వాల్‌కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది, ఆగ్రహంతో చిర్రు బుర్రులాడుతూ వెళ్లింది. ఇటీవల ఓ పార్టీలో పాల్గొన్న ప్రగ్యా జైస్వాల్‌ను చూసిన ఫొటోగ్రాఫర్లు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. ఆమె వెంటపడి మరీ ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. దీంతో ప్రగ్యా కొద్దిగా అసహనం వ్యక్తం చేసింది. ఫొటోగ్రాఫర్స్‌ని ఏదో తిట్టేసుకుంటూ వెళ్లింది. సెలబ్రిటీలని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఫొటోగ్రాఫర్స్‌పై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి కొందరు అలాంటి డ్రస్ వేసుకుని పబ్లిక్ ప్లేస్‌కు వచ్చావు.. ఇప్పుడు ఫొటోలు తీస్తే ఎందుకు బాధపడుతున్నావు? అంటూ ప్రగ్యానే తప్పు బడుతున్నారు.
- July 8, 2025
0
43
Less than a minute
Tags:
You can share this post!
editor

