మహేష్‌ చంద్ర దర్శకత్వంలో సరికొత్త సినిమా..?

మహేష్‌ చంద్ర దర్శకత్వంలో సరికొత్త సినిమా..?

మహేష్‌చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పిఠాపురంలో’. ‘అలా మొదలైంది’ అనేది ఉపశీర్షిక. రాజేంద్రప్రసాద్‌, పృధ్వీరాజ్‌, కేదార్‌శంకర్‌, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. తొలి సినిమా ‘ప్రేయసి రావే’తోనే దర్శకుడిగా తన సత్తా చాటుకున్న మహేష్‌చంద్ర, అనంతరం ‘అయోధ్య రామయ్య’, ‘చెప్పాలని ఉంది’, ‘జోరుగా హుషారుగా’, ‘ఒక్కడే’, ‘హనుమంతు’, ‘ఆలస్యం అమృతం’, ‘రెడ్‌అలర్ట్‌’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన రూపొందిస్తున్న ఈ సినిమాను మహేష్‌చంద్ర బ్యానర్‌పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్‌ఎం మురళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

editor

Related Articles