‘పెద్ది’ ఫస్ట్ సింగిల్త్వరలోనే..!

‘పెద్ది’ ఫస్ట్ సింగిల్త్వరలోనే..!

రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమాయే “పెద్ది”. రంగస్థలం సినిమా తర్వాత చరణ్ నుండి రాబోతున్న మరో విలేజ్ డ్రామా ఇది కాగా దీనిపట్ల మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని ఎక్కడా కూడా తగ్గకుండా మేకర్స్ ప్లాన్ చేస్తుండగా లెజెండరీ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్ పాటలు ఇంకా స్కోర్‌పై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా తాలూకా మ్యూజికల్ బ్లాస్ట్‌కి రంగం సిద్ధం అవుతున్నట్టుగా ఇపుడు తెలుస్తోంది. మేకర్స్ త్వరలోనే సినిమా తాలూకా ఫస్ట్ సింగిల్‌ని వదిలే సన్నాహాలు ఆల్‌రెడీ చేస్తున్నారట. అలాగే ఈ సాంగ్ రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లపై ఉండొచ్చని టాక్. మరి రెహమాన్ ఈ సాలిడ్ కాంబినేషన్ కోసం ఎలాంటి ట్యూన్ అందించారో వేచి చూడాల్సిందే. క్లిక్ అయితే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో జాతరే అనుకోవచ్చు. ఇక ఈ సినిమాకి వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహించగా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

editor

Related Articles