పాయ‌ల్ రాజ్‌పుత్ తండ్రి క‌న్నుమూత‌..

పాయ‌ల్ రాజ్‌పుత్ తండ్రి క‌న్నుమూత‌..

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) జులై 28న కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. తండ్రి మరణం పాయల్‌కు తీరని లోటుగా మారింది. తన బాధను ఆమె సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేయ‌గా, ఇది ఫ్యాన్స్‌ను కలచివేసింది. ‘‘నాన్నా… లవ్ యూ, మిస్ యూ’’ అంటూ పాయల్ రాజ్‌పుత్ భావోద్వేగానికి గురయ్యారు. “నాన్నా… నువ్వు ఇక భౌతికంగా నాతో ఉండకపోయినా… నీ ప్రేమ నాలో ఎప్పుడూ ఉంటుంది. నీ నవ్వు,  నీ మనసుకు హత్తుకునే ప్రతీ విషయం నాకు గుర్తుకువస్తుంది. ఈ లోకం నుండి నువ్వు వెళ్లిపోయినప్పటికీ, నా హృదయం నుండి నువ్వు వెళ్లలేవు. లవ్ యూ డాడీ” అని ఆమె పోస్ట్ పెట్టింది. పాయ‌ల్ రాజ్‌పుత్  పోస్టు చూసిన ఫ్యాన్స్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. రాయ్ లక్ష్మీ, దివి, పాయల్ ప్రియుడు సౌరభ్, తదితరులు సోషల్ మీడియా ద్వారా పాయల్‌కి ధైర్యం చెప్పారు.

editor

Related Articles