ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన సినిమా “హరిహర వీరమల్లు” గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అన్ని పనులు పూర్తయ్యి రిలీజ్ డేట్ దగ్గరకి వస్తుండగా దర్శకుడు జ్యోతి కృష్ణ ఓ బ్యూటిఫుల్ మూమెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదొక ప్రొఫిషినల్ మెమరీ కాదు లైఫ్ టైం మెమరీ అంటూ తాను తన భార్య కూతురు అలాగే తన తండ్రి ఇంకా సినిమా నిర్మాత ఎ ఎం రత్నం కలిసి కనిపించిన ఫొటోని షేర్ చేసుకున్నారు. జ్యోతి కృష్ణ కూతురు అహానాని పవన్ ఎత్తుకోగా నేడు తన చిన్నారి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తాను షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక జ్యోతికృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్‌గా అన్ని థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
- July 10, 2025
0
51
Less than a minute
Tags:
You can share this post!
editor

