ఏపీ డిప్యూటీ సీఎం రాజకీయాలలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న పవన్ ఇలా అడుగడుగునా అనారోగ్యానికి గురికావడం జన సైనికులు ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటీవల ఏపీ కేబినెట్ మీటింగ్ ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ కావాల్సి ఉండగా పవన్ ఉదయం పదిన్నరకే చేరుకున్నారు. మీటింగ్ సమయంలో పవన్ తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడ్డారు. ఆయనకు స్పాండిలైటిస్ సమస్య కూడా ఉందని, దీంతో చాలాకాలంగా బాధపడుతున్నారట. ఆయన రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో ఉన్నప్పటి నుండే పవన్‌కు ఈ సమస్య ఉందని, రాజకీయాల్లోకి వచ్చాక క్షణం తీరిక లేకుండా పవన్ పర్యటిస్తున్న కారణంగా ఆయన అనారోగ్యం బారిన పడుతున్నారని అంటున్నారు. పవన్ ఆరోగ్యం బాగోలేకపోయినా కానీ, రాష్ట్ర సచివాలయంలో 16వ ఆర్ధిక సంఘం సభ్యులతో మంత్రివర్గ కీలక సమావేశం జరిగిన సందర్భంలో పవన్ పాల్గొన్నారు.

- April 17, 2025
0
41
Less than a minute
Tags:
You can share this post!
editor