సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా గిఫ్ట్ అందించారు దర్శకుడు రాజమౌళి. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ ప్రాజెక్ట్ SSMB29 కి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ స్పెషల్ డేకి గిఫ్ట్‌గా ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ, నవంబర్‌లో సినిమా గ్లింప్స్ రానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే రిలీజ్ చేసిన పోస్టర్‌లో మహేష్ ఫేస్ కనిపించకపోయినా, ఆయన మెడలో ఉన్న లాకెట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ లాకెట్‌లో మూడు నామాలు, త్రిశూలం, ఢమరుకం, నంది, రుద్రాక్షలు వరుసగా అమర్చబడి ఉన్నాయి. అయితే ఇది సాధారణ లాకెట్ కాదు, దీన్ని డిజైన్ చేయడంలో హిందూ మైథాలజీలో శివుడికి సంబంధించిన ప్రతీకలు ఉండటంతో కథలో శివతత్త్వానికి సంబంధించిన అంశాలు ఉండే అవకాశంపై ఊహాగానాలు పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’, ‘బ్రో’ చిత్రాల్లో ఇలాంటి లాకెట్ ధరించాడు. ఈ లాకెట్లు అప్పట్లో ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మహేష్ బాబు మెడలో కనిపించిన లాకెట్ కూడా అంతే వైరల్ అవుతోంది. ఈ లాకెట్ కూడా మార్కెట్‌లోకి వస్తే, భారీగా సేల్స్ జరగడం ఖాయం అంటున్నారు. మొత్తానికి రాజమౌళి అందరి దృష్టి ఆ లాకెట్‌పై పడేలా చేసి సినిమాపై మరింత ఆసక్తి పెంచాడు. ఇక మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌కు ఇది తొలి సినిమా కాగా, అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతోందని సమాచారం.

- August 10, 2025
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor