దర్శకుడు ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందమైన ప్రేమకథా సినిమా ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లపై కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్ రెడ్డి, వెంకట్‌రాజులు, గాయిత్రమ్మ అంజనప్ప ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ని చిత్రబృందం విడుదల చేసింది. చాలాదూరం వెళ్ళిపోయావు గోదావరి. నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్ అని గ్లింప్స్‌లో వినిపించే డైలాగ్‌లు ఎమోషనల్‌గా ఆకట్టుకుంటున్నాయి. తీరంలో ఒక జంట కలుసుకోవడం, అందమైన విజువల్స్, నేపథ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు ఎంజీఆర్ తుకారాం ఈ సినిమాని అద్భుతమైన భావోద్వేగాలతో, హృదయాన్ని తాకే కథనంతో, అందమైన విజువల్స్‌తో తీర్చిదిద్దినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ వీడియో వైరల్‌గా మారింది. భవిష్యత్తులో విడుదల కాబోయే ప్రచార కంటెంట్‌పై ఇది మంచి అంచనాలను పెంచింది. ఈ సినిమాకి ఎఐఎస్ నౌఫల్ రాజా సంగీతాన్ని అందిస్తుండగా, రుద్రసాయి అండ్ జానా డీఓపీగా వ్యవహరిస్తున్నారు.

- August 10, 2025
0
38
Less than a minute
Tags:
You can share this post!
editor