యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్.పిబ్యానర్ పై మాధవి, ఎం.ఎస్.ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేష్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. నాకు సపోర్టుగా నిలిచిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా ట్రైలర్ రిలీజ్ చేశాం. కొంచెం ఓపెన్ మైండ్ తో చూడమని కోరుకుంటున్నాను. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇది. అందరూ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్లే సినిమా. మా ప్రొడ్యూసర్ మాధవి గారు చాలా పాషన్ తో తీశారు.

