ఆదివారం ఓపెనింగ్‌ అయిన  ‘వన్‌ వే టికెట్‌’..

ఆదివారం ఓపెనింగ్‌ అయిన  ‘వన్‌ వే టికెట్‌’..

హీరో వరుణ్‌ సందేష్ నటిస్తున్న తాజా సినిమా ‘వన్‌ వే టికెట్‌’. ఎ.పళని స్వామి దర్శకత్వంలో జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ సినిమా ఓపెనింగ్‌ ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. సీనియర్‌ నిర్మాత సి.కళ్యాణ్‌ ముహూర్తపు షాట్‌కి క్లాప్‌ కొట్టగా,  దర్శకుడు త్రినాథరావు నక్కిన కెమెరా స్విచాన్‌ చేశారు. నిర్మాతలు హర్షిత్‌ రెడ్డి, టి.ఎస్‌.రావు స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. సినిమా బాగా రావాలని, ఘన విజయం సాధించాలని అతిథులంతా ఆకాక్షించారు. వరుణ్‌ సందేష్  మాట్లాడుతూ ‘టైటిల్‌ లాగానే కథ కూడా కొత్తగా ఉంటుంది. ఇందులో విభిన్నమైన పాత్రలో కనిపిస్తా. త్వరలో షూటింగ్‌ ప్రారంభించబోతున్నాం. తప్పకుండా అందరూ మెచ్చేలా సినిమా తెరకెక్కుతుందని నమ్మకంతో ఉన్నా’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ అని, వరుణ్‌ సందేష్  కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుందని  దర్శకుడు పళనిస్వామి నమ్మకంగా చెప్పారు. ఇంకా నిర్మాత శ్రీనివాసరావు, హీరోయిన్ కుష్బూ చౌదరి, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌, నటులు మనోజ్‌, సుధాకర్‌ కూడా మాట్లాడారు. ఈ సినిమాకి కెమెరా: శ్రీనివాస్‌ బెజుగమ్‌.

editor

Related Articles