తెలుగులో మూడేళ్ల తర్వాత బెంగళూరు హీరోయిన్ నిధి అగర్వాల్ పవన్‌కళ్యాణ్ సరసన నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. ఈ సందర్భంగా గురువారం నిధి అగర్వాల్ విలేకరులతో సినిమా సంగతుల్ని షేర్ చేసింది. పవన్‌కళ్యాణ్ వంటి తిరుగులేని స్టార్‌డమ్ ఉన్న హీరోతో కలిసి నటించడం గొప్ప అదృష్టమని, ఆయనతో ఒక్క సినిమా చేసినా అది 100 సినిమాలతో సమానమని చెప్పింది. ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు పంచమి. తను చాలా శక్తివంతురాలు. ఎలాంటి సవాలులైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండే ధైర్యశాలి. నా పాత్ర భిన్న కోణాలతో ఆసక్తికరంగా సాగుతుంది’ అని నిధి అగర్వాల్ పేర్కొంది. మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకుని ఈ కథను రాశారని, ఇందులో పవన్‌కళ్యాణ్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారని తెలిపింది. సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఓ సన్నివేశం ఉంటుందని, అందులో అభినయించడం ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించానని చెప్పింది.

- July 18, 2025
0
101
Less than a minute
Tags:
You can share this post!
editor