‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్‌ రిలీజ్..

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్‌ రిలీజ్..

‘కేరాఫ్‌ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి సినిమాలతో సూప‌ర్ హిట్‌ల‌ను అందుకున్న నిర్మాత ప్రవీణ పరచూరి ఇప్పుడు మెగాఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కురాలిగా మారింది. ఆమె ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న తాజా సినిమా కొత్త‌ప‌ల్లిలో ఒక‌ప్పుడు. ద‌గ్గుబాటి రానా ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరిస్తుండ‌గా.. ప‌ర‌చూరి విజ‌య్, గోపాలకృష్ణ పరచూరి & ప్రవీణ పరచూరి నిర్మిస్తున్నారు. రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా సినిమా నుండి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతోంది. రూర‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రాబోతున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమాతో మనోజ్ చంద్ర, మోనిక టి, ఉషా బోనెలను వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తుండ‌గా.. రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేంసాగర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

editor

Related Articles