ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు రామకృష్ణ. అప్పన్న అనే వడ్డీ వ్యాపారి దగ్గర పనిచేస్తూ ఉంటా. ఆ వ్యాపారి ఇచ్చిన అప్పుల్ని వసూలు చేయడం నా పని. అప్పన్నకూ, జనాలకూ మధ్య అనుసంధానకర్తను నేను. ఇందులో నాకో రికార్డింగ్ డ్యాన్స్ స్టూడియో కూడా ఉంది. ఎలాగైనా ఆ స్టూడియోను డెవలప్ చేసి, అప్పన్న నుండి బయట పడాలని తాపత్రయపడుతూ ఉంటాను. అలాగే సావిత్రి అనే అమ్మాయి అంటే నాకిష్టం. ఒకరోజు సావిత్రిని కలవడానికి గడ్డివాము చాటుకు వెళ్తాను. ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే ఇందులో ఆసక్తికరమైన అంశం అని తెలిపారు హీరో మనోజ్ చంద్ర. ఆయన హీరోగా ప్రవీణ పరుచూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. మోనికా హీరోయిన్. రానా దగ్గుబాటి సమర్పణలో, పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా 18న విడుదల కానుంది. రానా ఈ సినిమాకు ప్రెజెంటర్ కావడంతో మంచి గుర్తింపు వచ్చింది. వైజాగ్, విజయవాడ, వరంగల్ ఇలా కొన్నిచోట్ల ఈ సినిమా ప్రివ్యూస్ వేశాం. అన్నిచోట్లా మంచి స్పందన వచ్చింది. సినిమా విజయంపై చాలా నమ్మకంతో ఉన్నాం. సాంకేతికంగా కూడా సినిమా అభినందనీయంగా ఉంటుందని చెప్పారు మనోజ్ చంద్ర.

- July 15, 2025
0
46
Less than a minute
Tags:
You can share this post!
editor