Movie Muzz

‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్‌ దగ్గరలోనే ఉంది..

‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్‌ దగ్గరలోనే ఉంది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమాయే “ఓజి”. భారీ అంచనాల మధ్య సెట్ చేసుకున్న ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా వీరి ఇద్దరి మధ్య సాగే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్‌ని రెండో పాటగా ఈ సినిమా నుండి విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సాంగ్ రిలీజ్‌పై లేటెస్ట్ అప్‌డేట్ తెలుస్తోంది. దీనితో ఈ ఆగస్ట్ 27న మేకర్స్ వినాయక చవితి కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. సో ఓజి సాంగ్ కేవలం మరికొన్ని రోజుల్లోనే రానుంది అని చెప్పవచ్చు. అయితే దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది.

administrator

Related Articles