OG vs అఖండ-2.. ఏ సినిమా ముందో..?

OG vs అఖండ-2.. ఏ సినిమా ముందో..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, అదే రోజున నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ-2’ కూడా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దీంతో ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా తమ రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకుంటుందా అని ఫ్యాన్స్‌లో చర్చ సాగుతోంది. అయితే, ఓజి సినిమాని వాయిదా వేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ, మేకర్స్ మాత్రం అదేరోజున రిలీజ్ ఖచ్చితంగా చేస్తామని అంటున్నారు. ఇక అఖండ-2 సినిమా  షూటింగ్ కొంత ఆలస్యం అవుతుండటంతో ఇప్పుడు ఈ సినిమాను ప్రకటించిన తేదీకే రిలీజ్ చేస్తారో లేదో అనే అనుమానంతో ఫ్యాన్స్ సందిగ్ధంలో పడ్డారు. అఖండ-2 సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం జరుగుతుండటం ఒకటి.. షూటింగ్ ఇంకా పెండింగ్ బ్యాలెన్స్‌ ఉండడంతో ‘అఖండ-2’ సెప్టెంబర్ 25న రావడం కష్టమే అని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాని డిసెంబర్‌కు వాయిదా వేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ విషయంపై మేకర్స్ నుండి ఖచ్చితంగా ఓ క్లారిటీ రావాల్సి ఉంది.

editor

Related Articles