‘ఓజి’ – ప్రజల్ని ఊర్రూతలూగించే యాక్షన్ సినిమా..

‘ఓజి’ – ప్రజల్ని ఊర్రూతలూగించే యాక్షన్ సినిమా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాయే “ఓజి”. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ హైప్‌తో వచ్చింది. మరి ఆ హైప్‌ని ఈ సినిమా మ్యాచ్ చేసిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం రండి.
1993 సమయంలో ముంబై పోర్ట్‌కి దాదా అయినటువంటి సత్య దాదా (ప్రకాష్ రాజ్)కి అండగా ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) అండగా ఉంటాడు. కానీ ఓ కారణం చేత గంభీర సత్య దాదా నుండి దూరం కావాల్సి వస్తుంది. అక్కడ నుండి ఆ పోర్ట్‌పై చాలామంది కన్ను పడుతుంది. గంభీర ఎందుకు సత్య దాదాకి దూరం అయ్యాడు? అసలు ఇద్దరికీ లింక్ ఎలా కుదిరింది? ఇంకోపక్క అర్జున్ (అర్జున్‌దాస్) గంభీరని ఎందుకు చంపాలి అనుకుంటాడు. ఓమిగా పిలవబడే ఓంకార్ వర్ధమాన్ (ఇమ్రాన్ హష్మీ) తాలూకా ఆర్డియక్స్ కంటైనర్లు సత్య దాదా పోర్ట్‌కు వచ్చాక ఎలా మాయమయ్యాయి? ఈ మధ్యలో గంభీర కోల్పోయింది ఏంటి? అసలు ఈ గంభీర ఎవరు? అతని గతం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తూ చూడాల్సిందే.

editor

Related Articles