తన నటనతో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇండియాకు చెందిన ఎస్క్వైర్ మ్యాగజైన్ కవర్‌పై ఎన్టీఆర్‌ను ప్రచురించారు నిర్వాహకులు. ‘ఫ్రమ్ టీన్ ప్రాడిజీ టు పాన్ – ఇండియా పవర్‌హౌస్’ నుండి క్రమ క్రమంగా ఎదిగిన స్టార్ నటుడంటూ రాసుకొచ్చింది. మెరూన్ కలర్ షేర్వానీ ధరించిన ఎన్టీఆర్ కుర్చీలో కూర్చుని స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫొటో షూట్ దుబాయ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. అతడిలో చరిష్మా ఉంది. చాలా చురుకైన వ్యక్తి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటులలో అతడు కూడా ఒకరు. గొప్ప కుటుంబంలో పుట్టినప్పటికీ.. ఆ వారసత్వానికి కట్టుబడి ఉండాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. అతడే ఎన్టీఆర్. అతడి సినీ ప్రయాణాన్ని మా ఆగస్ట్ సంచికలో కవర్‌పై మేము ప్రచురించబోతున్నాం. ఇది అతడి తొలి మ్యాగజైన్ కవర్ కూడా అంటూ ఎస్క్వైర్ రాసుకొచ్చింది.

- August 5, 2025
0
40
Less than a minute
Tags:
You can share this post!
editor