ఎన్టీఆర్ కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడా?

ఎన్టీఆర్ కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో ప్రతిష్టాత్మక చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఘన విజయాన్ని సాధించగా, ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం దైవిక నేపథ్యంతో, పురాణాల స్ఫూర్తితో రూపొందనున్న విజువల్ స్పెక్టాకిల్‌గా తెరకెక్కనుంది. లోతైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, కొత్త ప్రపంచ నిర్మాణంతో ఈ సినిమా ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని అందించనుందని చిత్రబృందం తెలిపింది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనుండగా, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎన్టీఆర్ ఆర్ట్స్ తరఫున నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్రీకరణ షెడ్యూల్ తదితర వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Related Articles