ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘వార్ 2’ లో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాపై బీటౌన్‌లో ఆసక్తికరమైన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెడితే.. ఈ సినిమాలో తారక్ డబుల్ రోల్‌లో నటిస్తున్నారట. ఎన్టీఆర్ రెండు పాత్రలూ ఒకదానితో ఒకటి పోరాడతాయని తెలుస్తోంది. ఈ కథలో ఇదే హైలైట్ అని సమాచారం. కథ రీత్యా ఇందులో హృతిక్ కంటే ఎన్టీఆర్‌కే ఎక్కువ ప్రాధానత్య ఉంటుందని బాలీవుడ్ అంటోంది. బాలీవుడ్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమ హీరోని తక్కువ చేసుకోవడం జరిగే పనికాదని ఆయన ప్రాధాన్యత ఏమాత్రం తగ్గకుండా చూస్తున్న నిర్మాతలు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే వచ్చే ఆగస్ట్ 14 దాకా వెయిట్ చేయాల్సిందే.
											- January 4, 2025
 
				
										 0
															 138  
															  Less than a minute 
										
				
			You can share this post!
editor
				
