హీరోయిన్ పూజాహెగ్డే తన సినీ ప్రయాణంలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. భారీ సినిమాల్లో అవకాశాలొస్తున్నా.. విజయాలు వరించకపోవడం ఈ మంగళూరు సుందరిని కలవరపెడుతోంది. ఎలాగైనా ఓ భారీ హిట్‌తో పరాజయాల పరంపరకు బ్రేక్ వేయాలనే కృతనిశ్చయంతో ఉంది. వరుస ఫ్లాపులొచ్చినా ఆఫర్ల పరంగా తనకు ఢోకాలేదని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో ఈ హీరోయిన్ మరో పెద్ద సినిమాలో హీరోయిన్గా ఎంపికైనట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. నితిన్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ‘ఇష్క్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ రావడంతో.. తాజా సినిమాపై అందరిలో ఆసక్తిపెరిగింది. నితిన్ హార్స్ రైడర్‌గా కనిపించే ఈ సినిమాకి ‘స్వారీ’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే దాదాపుగా ఖరారైందని టాక్. నితిన్‌తో ఈ హీరోయిన్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

- August 12, 2025
0
50
Less than a minute
Tags:
You can share this post!
editor